సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
క్షణాల వ్యవధిలో మీ ఖాతా (State Bank of India)లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) నివారించేందుకు కేంద్రం విద్యా సంస్థలు మూసివేయడంతో ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ తమ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ( Online classes ) చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పిల్లలకు ఫోన్స్ ఇవ్వడానికి జంకిన తల్లిదండ్రులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసెస్ హాజరవడం కోసం స్మార్ట్ ఫోన్స్ ( Smart phones ) కొని పిల్లల చేతుల్లో పెడుతున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడింది ( Union minister Kishan Reddy's personal website hacked ). పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేసిన నేరం కింద ఇటీవలే అరెస్ట్ అయిన కత్తి మహేశ్‌ను ( Kathi Mahesh), మరో కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ( Cybercrime cops ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులు జైలుపాలయ్యారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్ల కోసం సెర్చ్ చేసే వారిని గుర్తించడం కోసం ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్సు ( NCRB )లో స్పెషల్ సెల్ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వినియోగదారులకు ( Bank Account Holders ) సరికొత్త సూచనలు జారీ చేసింది. సైబర్ స్కామ్‌ల ( Cyber Scams ) నుంచి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యక్తిగత ఖాతాల్లోకి చొరబడి గంపగుత్తగా లక్షల్లో దోచుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి నిండా మునిగాడు. వివరాల్లోకి వెళితే..
దాదాపు 100 వరకు సైబర్ నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసు రికార్డులకెక్కిన ఓ సైబర్ నేరగాడిని గురుగ్రామ్ సైబర్ విభాగం పోలీసులు నిన్న చాకచక్యంగా వలేసి పట్టుకున్నారు. చాలామంది నేరగాళ్ల తరహాలో తాము టార్గెట్ చేస్తున్న వ్యక్తులకు ఫోన్ కాల్స్ చేయకుండానే పని కానివ్వడం ఈ క్రిమినల్ ప్రత్యేకత కావడంతో ఇంతకాలం వీడి ఆచూకీని పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
భాగ్యనగరంలో కొత్త తరహా సైబర్ మోసం జరిగింది. ఓ యువతి వాడిపడేసిన పాత ఫోన్ నంబర్ ను ఓ సెల్యులార్ సంస్థ మరొకరికి కేటాయించగా ఆమె ఖాతా నుంచి రూ. 7 లక్షలు మాయం అయ్యాయి. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో కొత్త తరహా ఆన్ లైన్ మోసం జరిగింది. సైబర్ మోసానికి పాల్పడ్డ ఓ వ్యక్తి..ఆన్ లైన్ మాధ్యమంగా యువతి బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్ ను మార్చాడు. ఆపై ఆమె ఖాతా సంఖ్య, కార్డు వివరాలతో డబ్బును పేటీఎంలోకి ట్వాన్స్ ఫర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ యువతి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 3 లక్షలు పోగొట్టుకుంది.
సైబర్ క్రైమ్ పోలీసులు.. డివైజ్‌ను కనిపెట్టడానికి తమ వద్ద ఉన్న అధునాతన సాంకేతికతతో పాటు గూగుల్ మ్యాప్స్ సహకారం కూడా తీసుకొని.. సెల్ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.