WhatsApp OTP Scam అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

What is WhatsApp OTP | ఈ మధ్య కాలంలో కొత్త స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో హ్యాకర్స్ సింపుల్ గా ఓటీపి వాడి ప్రజలను స్కామ్ చేస్తున్నారు.

  • Nov 26, 2020, 22:51 PM IST

How to avoid WhatsApp OTP Scam | వాట్సాప్ ఈ రోజుల్లో అత్యంత ప్రజాధారణ కలిగిన మెసేజ్ యాప్స్ లో ఒకటి అనడంలో ఎలాంటి  సందేహం లేదు. ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మీడియా ఫైల్స్, మెసేజింగ్ కోసం వినియోగిస్తారు. 

Also Read | Tooter Features: టూటర్.. ఇండియన్ వర్షన్ సోషల్ నెట్వర్క్

 

1 /6

ఫేస్ బుక్  (Facebook) సంస్థ నిర్వహించే ఈ వాట్సాప్ గత కొన్ని రోజులుగా సెక్యూరిటీ కారణం వల్ల వార్తల్లో నిలిచింది. చాలా మందిలో ఇది టెన్షన్ పుట్టిస్తోంది. ఇటీవలే వాట్సాప్ ఓటీపి స్కామ్ ఒకటి చాలా మందిని ఇబ్బంది పెడుతోంది.   

2 /6

వాట్సాప్ ను మీరు మీ మొబైల్లో సెట్ చేస్తున్న సమయంలో మీకు ఒక ఓటీపి వస్తుంది. ఆ ఓటీపి ఉంటేనే మీరు లాగిన్ అవ్వగలరు. వెంటనే మీ ఎకౌంట్ సెట్ అవుతుంది.

3 /6

వాట్సాప్ ఓటీపిని (WhatsApp OTP) మోసగాళ్లు వాడుకోవడానికి ప్రయతన్నిస్తున్నారు. హ్యాకర్లు వాళ్ల ఫోన్ లో వాట్సాప్ ఇంస్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీకు ఓటీపీ వస్తుంది కదా దాన్ని తెలుసుకోవడానికి మీకు ఫోన్ లేదా మెసేజ్ చేస్తారు. దాన్ని ఇస్తే.. మీ ఎకౌంట్ లేదా డాటాపై వారికి అధికారం అభిస్తుంది.

4 /6

ఈ వాట్సాప్ ఓటీపి స్కామ్ చాలా కాలం నుంచి నడుస్తోంది. గ్రూప్ చాట్స్ లో (Group Chats) ప్రమోషన్ పేరిట మీ ఎకౌంట్ నెంబర్ ను వినియోగిస్తాడు. మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ కూడా మార్చేస్తాడు.

5 /6

అవగాహన తెచ్చుకోవడం మొదటి స్టెప్. మీరు పాస్వర్డ్ ఇవ్వకపోతే ఈ స్కామ్ లో మీరు నష్టపోయే అవకాశం ఉండదు. ఇలా మీకు కాల్ లేదా మెసేజ్ వస్తే వాటిని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి.  

6 /6

వాట్సాప్ స్కామ్ మాత్రమే కాదు.. ఇలాంటి స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే మీ ఓటీపిని ఎట్టిపరిస్థితిలోనూ ఎవరితో షేర్ చేసుకోరాదు.