First Covid Death in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈసారి జేఎన్ 1 రూపంలో వచ్చిన కొవిడ్ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా వైరస్ కారణంగా తెలంగాణలో రెండు మరణాలు సంభవించాయి. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరిన రోగి మృతి చెందాడు. అయితే వ్యాధి తీవ్రం కావడం వల్లే పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర చెప్పారు. అయితే అతడి కొవిడ్ టెస్టులు చేయగా.. అందులో పాజిటివ్ గా నిర్దారణ అయింది. మరోవ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. అతడికి కూడా వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యులు అప్రమత్తమయి.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్ లో ఇద్దరు పీజీ డాక్టర్లు కొవిడ్ బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 90 శాతానికి పైగా కేసులు భాగ్యనగరంలో నమోదవుతున్నాయి. సోమవారం 10 కరోనా కేసులు వెలుగు చూడగా.. అందులో తొమ్మిది కేసులు హైదరాబాద్ లోనే రికార్డయ్యాయి. అయితే కొవిడ్ సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 కేసులు కూడా రాష్ట్రంలో బయటపడ్డాయి. తాజాగా రెండు కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
Also Read: Narendra Modi: రికార్డ్ క్రియేట్ చేసిన మోదీ యూట్యూబ్ ఛానల్…ప్రపంచంలోనే తొలి నేత
మరోవైపు ఏపీలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29 ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జేఎన్.1 కేసులు సంఖ్య 69కి చేరింది.
Also Read: Earthquake today: లడఖ్, కశ్మీర్‌ల్లో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook