India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన ఒక్క రోజులో తాజాగా 7,178 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 65,683కి చేరుకుంది. మెుత్తం కేసుల్లో క్రియాశీల కేసుల 0.15 శాతం ఉన్నాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 9.16 శాతంగా నమోదైంది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,31,345కు చేరుకుంది. కోవిడ్ -19 రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైంది.
భారత్ లో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,01,865కి చేరుకోగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల టీకా డోసులు ఇవ్వబడ్డాయి. నిన్న 10,112 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మెుత్తం కేసుల్లో సగం ఢిల్లీ, మహారాష్ట్రల్లోనే నమోదవుతున్నాయి. ఆదివారం దేశ రాజధానిలో 948, మహారాష్ట్రలో 545 కేసులు నమోదయ్యాయి.
Also Read: Kerala Water Metro: దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో.. ప్రత్యేకతలు తెలుసా..!
ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు XBB.1.16 కోవిడ్-19 వేరియంట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా రద్దీగా ఉండే ప్రదేశాల్లో అందరూ మాస్కులు ధరించాలని చెప్పారు. గత కొన్ని రోజులగా పదివేలకుపైగా నమోదవుతున్న కేసులు.. తాజాగా దిగిరావడం ఆనందం కలిగించే విషయమే.
Also Read: China: గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇండియాకు చైనా రక్షణ మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook