Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు

Kappa variant cases reported in UP: లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి కప్ప వేరియంట్ కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో జరిగిన రెగ్యులర్ రివ్యూ మీటింగ్ అనంతరం అమిత్ మోహన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు కప్ప వేరియంట్ కేసులు (Kappa variant cases) నమోదైనట్టు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2021, 10:23 PM IST
Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు

Kappa variant cases reported in UP: లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి కప్ప వేరియంట్ కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో జరిగిన రెగ్యులర్ రివ్యూ మీటింగ్ అనంతరం అమిత్ మోహన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు కప్ప వేరియంట్ కేసులు (Kappa variant cases) నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే, ఏయే జిల్లాల్లో ఆ రెండు కేసులు వెలుగుచూశాయనే వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. జనం భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉన్నందునే ఆ వివరాలు వెల్లడించడం లేదని ప్రసాద్ తెలిపారు.

Also read: Vaccination For Children: 12 నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై శుభవార్త

కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో 109 శాంపిల్స్‌కి జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరపగా.. అందులో 107 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు, రెండు కప్ప వేరియంట్ కేసులుగా నిర్ధారణ అయ్యాయని అమిత్ మోహన్ ప్రసాద్ స్పష్టంచేశారు. డెల్టా ప్లస్ వేరియంట్, కప్ప వేరియంట్ (Delta Plus variant, Kappa variant).. ఈ రెండు వేరియంట్స్ కూడా రాష్ట్రానికి కొత్తేం కాదని, గతంలోనే ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ వేరియంట్స్‌కి చెందిన కేసులు నమోదయ్యాయని ప్రసాద్ చెప్పారు. 

కప్ప వేరియంట్ కూడా కరోనావైరస్‌కి (COVID-19 new variants) చెందిన వేరియంటేనని, దీనికి చికిత్స కూడా సాధ్యమేనని చెప్పిన అమిత్ మోహన్ ప్రసాద్.. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.

Also read: Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News