India New Variant cases Updates: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు జేఎన్. 1 కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిన్న 500 దాటిన న్యూ వేరియంట్ కేసులు.. నేడు 600 మార్కును క్రాస్ చేశాయి. దేశవ్యాప్తంగా మెుత్తం 619 కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులు 12 రాష్ట్రాల్లో బయటపడ్డాయి. ఇందులో అత్యధికంగా కర్ణాటక నుంచే 199 కేసులు ఉన్నాయి. కేరళలో 148, మహారాష్ట్రలో 110, ఢిల్లీలో 15, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, రాజస్థాన్‌లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 619 కేసులు నమోదయ్యాయి. BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 వేరియంట్ వల్ల ముప్పు తక్కువేనని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 761 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో నిన్న ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కర్ణాటక నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, యూపీ నుంచి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న వైరస్ నుంచి 838 మంది కోలుకున్నారు. చలికాలం కావడంతో వైరస్ త్వరగా వ్యాపి చెందుతుంది. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రారోగ్య శాఖ ప్రకటించింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడంతోపాటు గుంపుల్లో తిరగొద్దని సూచించింది. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని తెలిపింది.
Also Read: గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్..
Also Read: PM Modi: లక్షదీవుల్లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్ సాహసం.. నెట్టింట పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook