YS Sharmila slams Telangana CM KCR: హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.. ''అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు'' అంటూ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు.
తిరుపతి ఎంపీ, వైసిపి నేత బల్లి దుర్గాప్రసాద్ రావు (64) ఇక లేరు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొవిడ్-19 చికిత్స ( COVID-19 ) పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు ( Heart attack ) వచ్చిందని.. ఈ కారణంగానే ఆయనను రక్షించుకోలేకపోయామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు జరిపిన పరీక్షల్లో వరుసగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్య బచ్చన్‌కి కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
COVID-19 treatment: అమరావతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ( APS RTC staff ) కరోనా భయం వెంటాడుతోంది. కరోనా సోకితే తమ పరిస్థితేంటని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో.. వారికి ఏపీ సర్కార్ ( AP govt ) అండగా నిలిచింది.
Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
COVID-19 cases in Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,974 కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే 195 కేసులు ఉన్నాయి.
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది.
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 143 కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, జగిత్యాల జిల్లాలో, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 178 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 143 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు, మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
AP COVID-19 Updates: అమరావతి : ఏపీలో కరోనావైరస్ కోరలు చాస్తోంది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఓవైపు భారీ సంఖ్యలో కోవిడ్-19 టెస్టులు (COVID-19 tests) చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనా నివారణ కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు
COVID-19 in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ మరునాడైన శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగి 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 143 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 cases) నమోదయ్యియి
COVID-19 in Telangana తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. గురువారం నాడు రాష్ట్రంలో 127 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కాగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 110 మంది ఉన్నారు.
55 Types of Coronaviruses | హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది అని తెలిసినప్పటి నుంచే అందరికీ గుండెల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. కానీ ఆ కరోనావైరస్‌లోనూ మళ్లీ 198 రకాల వైరస్లు ఉన్నాయని తెలిస్తే.. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. అవును.. మీరు చదువుతోంది నిజమే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 198 రకాల కరోనావైరస్లు ( 198 Types of Coronaviruses) ఉన్నాయట.
COVID-19 treatment కోవిడ్-19 చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని.. సిబ్బంది ఎవ్వరూ సెలవుల్లో వెళ్లకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender ) అధికారులను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.