Cancer patients: క్యాన్సర్‌ పేషెంట్స్‌కి కరోనా వస్తే.. ?

COVID-19 treatment కోవిడ్-19 చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని.. సిబ్బంది ఎవ్వరూ సెలవుల్లో వెళ్లకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender ) అధికారులను ఆదేశించారు.

Last Updated : Jun 3, 2020, 08:17 AM IST
Cancer patients: క్యాన్సర్‌ పేషెంట్స్‌కి కరోనా వస్తే.. ?

హైదరాబాద్: COVID-19 treatment కరోనావైరస్ వ్యాధికి చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని.. సిబ్బంది ఎవ్వరూ సెలవుల్లో వెళ్లకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender ) అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన క్యాన్సర్ పేషెంట్స్‌కి ( COVID-19 infected cancer patients ) కూడా అందరు పేషంట్లతో పాటే కలిపి చికిత్స అందిస్తున్నారని.. కానీ ఇక మీదట అలా కాకుండా వారికి వేరే వార్డ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్స అందించాలని ఆయన అధికారులకు సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వారికి అందిస్తున్న చికిత్సపై సమీక్ష చేపట్టిన సందర్భంగా అధికారులకు మంత్రి ఈటల ఈ సూచనలు చేశారు. COVID-19 updates: తెలంగాణలో 92కి చేరిన కరోనా మృతుల సంఖ్య )

కరోనావైరస్‌పై జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో ( Fight against COVID-19 ) వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారని కొనియాడిన మంత్రి ఈటల.. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక విధివిధానాలు రూపొందించి అమలు చేయాలని వారి ఆరోగ్య పరిరక్షణకు ( Healthcare workers safety ) మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మంగళవారం బూర్గుల రామకృష్ణా రావు భవన్‌లో జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం గారూ.. మా గోడు కూడా వినండి.. )

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనావైరస్‌పై యుద్ధం విషయంలో గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హాస్పిటల్స్‌లో ఉన్న సిబ్బంది ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో అవన్నీ ఇప్పటికే పాటిస్తున్నామని అన్నారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాలను తెలుసుకునేందుకే ఈ విధావిధానాలు రూపొందించినట్టు స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News