YS Sharmila slams Telangana CM KCR: హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.. ''అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు'' అంటూ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్‌కు దోచిపెడుతున్నవేనని ఆరోపించిన ఆమె... కోవిడ్ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కొవిడ్ ఆస్పత్రులు ఉన్నవా అంటే ఉన్నా అన్నట్టుగానే ఉన్నాయని అన్నారు.
అయ్య పెట్టడు అడుక్కుతిననియ్యడు. KCR
కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు .. కేంద్ర ఆయుష్మాన్ భారత్ లో చేరరు.
దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పటల్స్ కు దోచిపెడుతున్నవి.
కోవిడ్ హాస్పిటల్స్ లో వసతులు ఉండవు ..
సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది. 3/1 @TelanganaCMO pic.twitter.com/wogfDlUbec— YS Sharmila (@realyssharmila) May 11, 2021
Also read : ఎవరెవరికి e-Pass తప్పనిసరి, ఎవరు ఇస్తారు ?.. క్లారిటీ ఇచ్చిన DGP మహేందర్ రెడ్డి
హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానని చేసిన ప్రకటనకు ఇంకా మోక్షం లేదు. ప్రజల ఆరోగ్యానికి సరిపోయేంత బడ్జెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉస్మానియా.. గాంధీ, నిమ్స్, టిమ్స్ ఆస్పత్రులకే ఊపిరి సక్కగా అందుతలేదు. ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలొ దీపం అనుకోవాల్సిందేనని సీఎం కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాగని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కరోనా వైద్యానికి ఎక్కువ రేటు చెల్లించి వైద్యం చేయించుకున్నా... అక్కడ బతికిన ప్రాణం అప్పులతో చచ్చేటట్టుంది అని మండిపడ్డారు. అందుకే ఇకనైనా KCR సారు .. సోయిలకురా. సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీలో (Aarogyasri scheme) చేర్చు అంటూ డిమాండ్ చేశారు.
కరోనా రోగులు పడుతున్న ఇక్కట్లు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యంపై ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చూపిస్తూ వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook