Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడానికి కారణం ఇదేనా ?

COVID-19 cases in Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,974 కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే 195 కేసులు ఉన్నాయి.

Last Updated : Jun 15, 2020, 12:13 AM IST
Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడానికి కారణం ఇదేనా ?

COVID-19 cases in Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,974 కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే 195 కేసులు ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లాలో 5, మంచిర్యాల జిల్లాలో 3 కేసులు గుర్తించారు. వరంగల్ అర్బన్‌, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే వరంగల్‌ రూరల్‌, మెదక్‌, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి తాజా హెల్త్ బులెటిన్ (Latest health bulletin) విడుదల చేసింది. Telangana: కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ముఖ్యమైన సమాచారం )

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనావైరస్‌ కారణంగా ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 185 కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 2,377 మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 2,412 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డి గంగాధర్‌కు సైతం కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా నిర్థారణ అయింది. నిన్న మొన్నటివరకు విధులలో భాగంగా ఓఎస్డీ గంగాధర్ కూడా మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender) వెంటే ఉండటం గమనార్హం. (  Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

ఇదేకాకుండా తెలంగాణ సెక్రెటేరియట్‌లోనూ ఇటీవల ఓ కరోనా కేసు నమోదైనట్టు తెలిసింది. ఐదు రోజుల క్రితమే కరోనా సోకిన ఓ ఉద్యోగిని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో (Nature cure hospital) చేరి చికిత్స పొందుతున్నారు. తెలంగాణ సచివాలయంలో కరోనావైరస్ కలకలం సృష్టించడం ఇది మొదటిసారి కాదు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో కరోనా కేసు. గత వారం తెలంగాణ సచివాలయంగా ఉపయోగిస్తున్న బీఆర్‌కేఆర్ భవన్‌లో 8వ అంతస్తులో పని చేస్తున్న ఓ అటెండర్, ఆపీస్ బాయ్‌కి కరోనా సోకినట్టు వార్తలొచ్చాయి.

అంతకంటే ముందుగా వారం రోజుల క్రితమే తెలంగాణ సీఎంవోలోనూ ( Telangana CMO) కరోనా కలకలం సృష్టించింది. ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలడంతో రెండు రోజుల పాటు సీఎంఓను మూసేసి శానిటైజ్ చేసినట్టు సమాచారం. 

టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరిగ రెడ్డికి (Muthireddy yadagiri Reddy) కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు లక్షణాలు ఏవీ లేవని.. పార్టీ శ్రేణులు, అనుచరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి తెలిపారు. Muthireddy Yadagiri Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. జనగాం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన )

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్థన్‌కి సైతం కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రైవేటు మీటింగ్‌లో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి కాసేపు సమయం గడిపిన బాజిరెడ్డి గోవర్థన్.. ముత్తిరెడ్డికి పాజిటివ్ అని తేలడంతో వెంటనే నిజామాబాజ్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి సమాచారం అందించారు. అనంతరం కోవిడ్-19 పరీక్ష కోసం రక్త నమూనా ఇచ్చారు. అలా బాజిరెడ్డి గోవర్థన్‌కి పాజిటివ్ అని తెలిసిన వెంటనే అధికారులు ఆయన కుటుంసభ్యులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News