COVID-19 treatment: ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆరాధ్య

Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు జరిపిన పరీక్షల్లో వరుసగా అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్య బచ్చన్‌కి కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Last Updated : Jul 18, 2020, 12:05 AM IST
COVID-19 treatment: ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆరాధ్య

Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు జరిపిన పరీక్షల్లో వరుసగా అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్య బచ్చన్‌కి కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే, అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) ముందు నుంచే ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతుండగా ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ( Isolation ) ఉంటూ వచ్చారు. అయితే, తాజాగా ఐశ్వర్యకు కొద్దిగా జ్వరం రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమె కూడా నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఐశ్వర్యతో పాటు ఆరాధ్య ( Aaradhya Bachchan ) సైతం కరోనాకు చికిత్స కోసం అదే ఆస్పత్రిలో చేరింది.

అమితాబ్ బచ్చన్ నివాసంలో కుటుంబసభ్యులు, సిబ్బంది కలిపి ఇప్పటివరకు 16 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది.

Trending News