Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

COVID-19 in Telangana తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. గురువారం నాడు రాష్ట్రంలో 127 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కాగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 110 మంది ఉన్నారు.

Last Updated : Jun 4, 2020, 11:30 PM IST
Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

హైదరాబాద్: COVID-19 in Telangana తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. గురువారం నాడు రాష్ట్రంలో 127 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కాగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 110 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 3,147కి చేరింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనావైరస్ ( Coronavirus ) నుంచి కోలుకుని 1,587 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు )

కరోనావైరస్‌తో చికిత్స పొందుతూ ఇవాళ ఆరుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 105కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,455 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News