Telangana: 55 రకాల కరోనావైరస్‌లు

55 Types of Coronaviruses | హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది అని తెలిసినప్పటి నుంచే అందరికీ గుండెల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. కానీ ఆ కరోనావైరస్‌లోనూ మళ్లీ 198 రకాల వైరస్‌లు ఉన్నాయని తెలిస్తే.. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. అవును.. మీరు చదువుతోంది నిజమే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 198 రకాల కరోనావైరస్‌లు ( 198 Types of Coronaviruses) ఉన్నాయట.

Last Updated : Jun 24, 2020, 02:44 AM IST

55 Types of Coronaviruses | హైదరాబాద్: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది అని తెలిసినప్పటి నుంచే అందరికీ గుండెల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. కానీ ఆ కరోనావైరస్‌లోనూ మళ్లీ 198 రకాల వైరస్‌లు ఉన్నాయని తెలిస్తే.. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. అవును.. మీరు చదువుతోంది నిజమే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 198 రకాల కరోనావైరస్‌లు ( 198 Types of Coronaviruses) ఉన్నాయట. అందులోనూ కేవలం తెలంగాణలోనే 55 రకాల కరోనా వైరస్‌లు ఉన్నాయంటున్నారు జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకులు. జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ 55 రకాలుగా జన్యు మార్పులు చేసుకుంటున్నదన్న మాట. కొవిడ్‌-19కు చెందిన 400 జన్యువులపై పరిశోధన చేసిన అనంతరం ఈ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చినట్లు జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి )

అత్యధిక జన్యు మార్పులకు గురైన రాష్ట్రాల్లో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌లో 60 రకాల వైరస్‌లు ఉండగా తెలంగాణలో 55 రకాల వైరస్‌లు ఉన్నాయి. తెలంగాణ తర్వాత 39 రకాల వైరస్‌లతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల కరోనాలు ఉన్నట్లు జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( Zoological survey of India) స్పష్టంచేసింది.జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News