దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం -2019పై వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. CAA-2019, NRCని వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రోజూ ఇవే ఆందోళనలతో అట్టుడుకుతోంది.
పెళ్లికి రోడ్డు బ్లాక్ చేస్తే ఊరుకుంటామా..? ఢిల్లీ షహీన్ భాగ్ లో రెండోసారి కాల్పులు జరిపి పట్టుబడ్డ వ్యక్తి ... పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం ఇది. నిన్న షహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వారిపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు .
కేరళ అసెంబ్లీలో ఈ రోజు వింత పరిణామం జరిగింది. అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పౌరసత్య సవరణ చట్టానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు .. కాస్తంత వెరైటీగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019పై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో CAA-2019 చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రానికి సూచించే విధంగా సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లు సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది.
పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బీజేపీ కూడా సానుకూల ఆందోళనల వ్యూహం సిద్ధం చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా బీజేపీ కీలక నేతలు పాల్గొంటున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019, జాతీయ పౌర పట్టిక- NRCకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో జాతీయ పౌర గణన-NPR ను మొదలు పెట్టాలని నిర్ణయించించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు.
తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. విపక్ష పార్టీ డీఎంకే సహా మిగతా రాజకీయ పార్టీలు రోజూ రోడ్లపై ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా నిత్యం నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటోంది.
పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికారపక్షమే ఏకంగా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కనిపించాయి.
పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళన కారణంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఎక్కడ చూసినా హింస చెలరేగుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. నిరసనకారుల ఆందోళన కారణంగా పలువురు మృతి చెందారు. ఐతే ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు..? ఎవరి ప్రోత్బలంతో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి..?
పౌరసత్వ సవరణ చట్టం CAA-2019పై దేశవ్యాప్తంగా నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పట్టు వీడడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.