పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019, జాతీయ పౌర పట్టిక- NRCకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో జాతీయ పౌర గణన-NPR ను మొదలు పెట్టాలని నిర్ణయించించినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఐతే NPR ను మే 15 నుంచి ప్రారంభించి మే 28 వరకు ముగిస్తామని చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా NPR ను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే బీహార్ లో మాత్రం మే 28 వరకు పూర్తి చేస్తామని సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.
NPRను ఏ రాష్ట్రం నిరాకరించలేదు
NPR ను బీహార్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని .. ఏ రాష్ట్రం దీన్ని వ్యతిరేకంచే వీలు లేదని సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ సహా అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనన్నారు. NPR అనేది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోనిదని తేల్చి చెప్పారు. NPR , NRC రెండు వేర్వేరని ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలో ఉన్న ముస్లింలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. కొంత మంది పని గట్టుకుని పౌరసత్వ సరవణ చట్టానికి వ్యతిరేకంగా అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.