Kerala Assembly resolution against CAA-2019 : ఆ చట్టం మాకొద్దు- కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  అధికారపక్షమే ఏకంగా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కనిపించాయి. 

Last Updated : Dec 31, 2019, 04:54 PM IST
Kerala Assembly resolution against CAA-2019 : ఆ చట్టం మాకొద్దు- కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  అధికారపక్షమే ఏకంగా ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కనిపించాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.  పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019ను దేశంలో అమలు చేయవద్దని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని  శాసన సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీలో మొత్తం 140 మంది సభ్యులుండగా .. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ మినహా మిగతా అందరూ మద్దతు ఇచ్చారు.

 

పౌర హక్కుల ఉల్లంఘనే..:పినరయి విజయన్
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడమంటే రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను ఉల్లంఘించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో  అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టం వల్ల దేశంలో అల్లర్లు చెలరేగాయని .. చివరకు కేరళలోనూ ఆందోళనలు వచ్చాయని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News