Kerala Governor reads Anit CAA Para as Cm wish : సీఎం సంతృప్తి కోసమే చదువుతున్నా...

కేరళ అసెంబ్లీలో ఈ రోజు వింత పరిణామం జరిగింది. అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పౌరసత్య సవరణ చట్టానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు .. కాస్తంత వెరైటీగా స్పందించారు. 

Last Updated : Jan 29, 2020, 12:13 PM IST
Kerala Governor reads Anit CAA Para as Cm wish : సీఎం సంతృప్తి కోసమే చదువుతున్నా...

కేరళ అసెంబ్లీలో ఈ రోజు వింత పరిణామం జరిగింది. అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పౌరసత్య సవరణ చట్టానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు .. కాస్తంత వెరైటీగా స్పందించారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా  గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వమే రూపొందించి ఇస్తుంది. తన ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ఆయన ప్రసంగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలు, సంక్షేమ పథకాలు ఇలాంటివి గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి. ఐతే  బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పేరాలు ఉన్నాయి. గతంలో కేరళ అసెంబ్లీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఐతే దీన్ని అప్పట్లోనే కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ వ్యతిరేకించారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ తీర్మానం చెల్లుబాటు కాదని తేల్చేశారు. మరో అడుగు ముందుకేసి పౌరసత్వ సవరణ అనేది కేంద్రం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. దీంతో CAA-2019 విషయంలో సీఎం పినరయి విజయన్ కు , గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వింతగా సాగింది.

CAA కు సంబంధించిన పేరాలు చదివే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు నేను చదివే పేరాలు .. CAAకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని సీఎం పినరయి విజయన్ చదవమన్నారు కాబట్టి నేను చదువుతున్నా. ఈ పేరాలకు ప్రభుత్వ పాలసీలకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం సీఎంను సంతృప్తిపరిచేందుకు మాత్రమే ఈ పేరాలు చదువుతున్నానని ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించడం ఆసక్తి రేపింది. 

అంతకుముందు కేరళ అసెంబ్లీలో రగడ రేగింది. ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు గవర్నర్ రాకను అడ్డుకున్నారు. ఆయన అసెంబ్లీలో పోడియం వద్దకు వెళ్లకుండా ప్లకార్డులు పట్టుకుని అడ్డగించారు. ఐతే వారిని మార్షల్స్ అడ్డుకుని గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ పోడియం వద్దకు వెళ్లేందుకు దారి కల్పించారు. ఐతే గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించే ముందుగానే యూడీఎఫ్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ను రీకాల్ చేయాలని నినాదాలు చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.
 

Trending News