Short video app TikTok as TickTock app: ఇండియాలో నిషేధానికి గురైన టిక్ టాక్ మొబైల్ యాప్ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ (ByteDance) కంపెనీ జులైలోనే టిక్ టాక్ యాప్ కోసం TickTock అనే కొత్త స్పెల్లింగ్ ఉపయోగించి ఇండియాలో ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
చైనీస్ యాప్ ల నిషేధంలో అగ్రరాజ్యం అమెరికా సైతం ఇండియా బాట పట్టింది. టిక్ టాక్, వి చాట్ యాప్ లను నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రేపట్నించి నిషేధం అమల్లో రానుంది.
అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ (Bytedance Rejected Microsoft) నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది.
టిక్‌టాక్ యాప్‌ను అమెరికాలో విక్రయించడానికి నిర్ణయించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని (extension of TikTok deadline in US) ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు టిక్ టాక పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్‌కు మరోసారి తన ఉద్దేశాన్ని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Bans TikTok Transactions) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు.
టిక్ టాక్ యాప్‌పై ( TikTok App ) భారత్ నిషేధం విధించడంతో ఆ యాప్‌ని అభివృద్ధి చేసి భారత్‌పైకి వదిలిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ ( Bytedance ) విలవిలలాడుతోంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని భారత్ నిషేధించగా ( 59 chinese apps banned ).. అందులో బైట్ డ్యాన్స్‌కి చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రజల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ దృష్ట్యా చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్ అమెరికాలో పెరుగుతోంది. ఈ మేరకు 25 మంది కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం.
టిక్‌టాక్ వీడియోలతో ( Tiktok videos ) ప్రపంచానికి పరిచయమైన టాలెంటెడ్ యూత్ ఎంతో మంది ఆ వీడియోలను తమ ప్రతిభను పది మందికి పరిచయం చేసేందుకు వినియోగిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం అదే పనిగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీగా పేరు తెచ్చుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.