TikTok: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చేదు అనుభవం!

అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ (Bytedance Rejected Microsoft) నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది.

Last Updated : Sep 14, 2020, 02:16 PM IST
TikTok: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చేదు అనుభవం!

టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ (Bytedance Rejected Microsoft) నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది. Goddeti Madhavi: మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ విక్రయంపై బైట్‌డ్యాన్స్ కంపెనీ నిర్ణయం తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. దీన్ని పొడిగించే ఉద్దేశమే లేదని, ఇష్టముంటే అమెరికా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని, లేనిపక్షంలో మూసివేయాలని వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. మరోవైపు బైట్‌డ్యాన్స్ (Bytedance) సంస్థ కోర్టును ఆశ్రయించింది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చినా ఈ అమెరికా కంపెనీకి విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ ససేమిరా అంటోంది. Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు!

కాగా, మరోవైపు ఒరాకిల్ సైతం టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఒరాకిల్ చేతికే టిక్‌టాక్ వెళ్లే అవకాశం ఉందని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News