Short video app TikTok as TickTock app: ఇండియాలో నిషేధానికి గురైన టిక్ టాక్ మొబైల్ యాప్ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ (ByteDance) కంపెనీ జులైలోనే టిక్ టాక్ యాప్ కోసం TickTock అనే కొత్త స్పెల్లింగ్ ఉపయోగించి ఇండియాలో ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
చైనా దేశపు యాప్ వి చాట్ కు ఊరట లభించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. నిషేధాన్ని నిలిపివేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
నిషేదిత టిక్‌టాక్ యాప్‌ను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాల్ని సమర్పించామని టిక్‌టాక్ ఇండియా అధిపతి అంటున్నారు.
47 Chinese clone apps: చైనా యాప్స్‌పై భారత్ మరోసారి ఉక్కుపాదం మోపింది. జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌లను ( China apps ) భారత్ నిషేధించింది. టిక్ టాక్ లైట్, కామ్ స్కానర్ అడ్వాన్స్ వంటి యాప్స్ తాజాగా నిషేధానికి గురైన యాప్స్ జాబితాలో ఉన్నాయి.
టిక్ టాక్ యాప్‌పై ( TikTok App ) భారత్ నిషేధం విధించడంతో ఆ యాప్‌ని అభివృద్ధి చేసి భారత్‌పైకి వదిలిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ ( Bytedance ) విలవిలలాడుతోంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని భారత్ నిషేధించగా ( 59 chinese apps banned ).. అందులో బైట్ డ్యాన్స్‌కి చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
Reels mobile app: టిక్ టాక్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత ఆ స్థానాన్ని కబ్జా చేసేందుకు చాలా మొబైల్ యాప్స్ పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే టిక్ టాక్ యాప్ ( Tiktok app ) స్థానంలో అవే ఫీచర్స్ కలిగిన చింగారి యాప్ ( Chingari app ), మోజ్ యాప్ ( Moj app ) లాంటి మొబైల్ యాప్స్ వచ్చాయి. ఇక ఇవే యాప్స్ బాటలో ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ కొత్తగా రీల్స్ అనే మొబైల్ యాప్‌ని తీసుకొచ్చింది.
టిక్ టాక్ ( Tiktok) పై నిషేధం అనంతరం అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ డేటా చోరీ అవుతుందనే భయంతో ఆ యాప్ ను నిషేదించారో..ఇప్పుడు ఆ డేటా పరిస్థితి ఏంటి? భారతీయుల డేటాను టిక్ టాక్ ( Indians Tiktok data) సంస్థ ఎక్కడ దాచిపెట్టింది ?
Sharechat launches Moj app: న్యూ ఢిల్లీ: టిక్‌టాక్ యాప్‌ని భారత్ నిషేధించడంతో ఆ యాప్‌కి ఉన్న మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇంచుమించు టిక్ టాక్ ఫీచర్స్‌తోనే ( Tiktok app ) ఉన్న ఇంకొన్ని యాప్స్ మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. భారత్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ కూడా తాజాగా అటువంటి యాప్‌నే లాంచ్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టిక్ టాక్ యాప్ ( TikTok Data ) ను నిషేధం టిక్ టాక్ ప్రేమికుల్ని షాక్ కు గురి చేసింది. చైనా యాప్ ను నిషేధించడం మంచిదే అనే అభిప్రాయంలో ఉన్నా సరే...తమ విలువైన డేటా పరిస్థితి ఏంటనే ఆందోళన పట్టుకుంది అందరికీ. అయితే మీ డేటా గురించి ఏ మాత్రం ఆందోళన చెందవద్దిక. ఇలా చేస్తే భద్రంగా డేాటాను డౌన్ లోడ్ ( Download Tiktok Data ) చేసుకోవచ్చు.
59 apps banned India: న్యూ ఢిల్లీ: చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టించింది. లఢఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఉన్న భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ ( India-China face off ) అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
TikTok app: కరోనావైరస్ సంక్రమణ, భారత్‌తో వివాదం నేపధ్యంలో చైనాను, చైనా యాప్స్‌ను నిషేధించాలన్న ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ ( TikTok )పై పడింది. అయితే, టిక్‌టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇతర ఇంకొన్నిఇతర యాప్స్ రంగంలోకి దిగుతున్నాయి.
టాక్‌టాక్ యాప్ నిర్వాహకులు ఉపయోగిస్తున్న ఫింగర్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం భయంకరమైందని.. పరోక్షంగా అది యూజర్లపై నిఘా వేస్తోందని స్టీవ్ హఫ్‌మన్ ఆరోపించాడు. అందుకే తాను అలాంటి యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకోనని స్టీవ్ చెప్పుకొచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.