Lalitha Jewellery Founder M Kiran Kumar Donation: వరదలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. సీఎం చంద్రబాబును కలిసి రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
Deputy CM Pawan Kalyan Suffers From Unhealthy: వరద సహాయ చర్యల్లో ఇలా పాల్గొన్నారో లేదో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అలా జ్వరం బారిన పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
YS Sharmila: విజయవాడ వరద కష్టాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
Krishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నిలకడగా తగ్గుతూ వస్తోంది. వర్షాలు కూడా తెరపినివ్వడంతో వరద క్రమంగా తగ్గుతుండడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంది.
Pawan Kalyan Comments On Vijayawada Floods: వరదలు ముంచుకొచ్చినా రెండు రోజులు ఏపీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే ఇబ్బంది వస్తుందనే భావనతోనే తాను రాలేదని పేర్కొన్నారు.
Telugu Desam Party Cancelled Celebrations Amid Heavy Rains: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సంబరాలు చేసుకోవరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కేక్ కటింగ్‌లు.. బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ప్రకటించింది.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Person Kidnap Infront Off Rajhamahendravaram Central Jail: జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన వ్యక్తిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తుని కోర్టు బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి బయటకు రాగా.. అయితే ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MLC Pothula Suneetha Resign From MLC And YSRCP: వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు వచ్చాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నాయకురాలు రాజీనామా చేశారు.
Mala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
Chiranjeevi Visits Tirumala: తన పుట్టినరోజు సందర్భంగా సినీ హీరో చిరంజీవి తన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరు కుటుంబం అక్కడి నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
Pensions with bogus certificates : ఇక నుంచి ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పొందుతున్నారో వారిపై కఠిన చర్యలు తప్పవని, పెన్షన్లను సైతం అనర్హులకు కట్ చేస్తామని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటన చేశారు. దీనిపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని సంక్షేమ నిధులను ఎట్టి పరిస్థితులను పక్కదారి పట్టనివ్వమని ఆయన పేర్కొన్నారు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.