YSR Rythu Bharosa Payment Status Online: సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా –పీఎం కిసాన్ ఐదో ఏడాది రెండో విడత నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమచేయనున్నారు. రూ.4 వేలు లబ్ధిదారుల ఖాతాలోకి జమకానున్నాయి.
Chandrababu Naidu Bail: చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. చంద్రబాబుకు చికిత్స కోసం కండీషన్ బెయిల్ ఇస్తే.. టీడీపీ నాయకులు న్యాయం గెలిచిదంటూ బాణసంచాలు కాల్చడం విడ్డూరంగా ఉందన్నారు.
Nara Lokesh Open Letter to CM Jagan: రైతుల ఇబ్బందులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు నారా లోకేష్. రాష్ట్రంలో రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరారు. లేఖలో ఏమన్నారంటే..?
Chandrababu Naidu Latest News: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడి భద్రతపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై పూర్తి అప్రమత్తతో ఉన్నామని తెలిపారు. 24 గంటలు సెక్యూరిటీతోపాటు సీసీ కెమెరాలతో పర్యావేక్షిస్తున్నామని చెప్పారు.
Partial Lunar Eclipse: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత తిరిగి 29న తెరవనున్నారు. భక్తులు ఈ మేరకు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
Rain Alert For AP: ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న మూడు రోజులు తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
TDP Janasena Coordination Meeting: తెలుగుదేశం, జనసేన పార్టీలు తొలిసారి ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో నిర్వహించాయి. ఈ సమావేశంలో మూడు తీర్మాణాలకు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించి.. ప్రజల్లోకి వెళ్లనున్నారు.
Palnadu News: పల్నాడు జిల్లాలో జరిగిన ఓ సంఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. భార్య పండంటి బిడ్డకు ప్రసవించగా.. కాసేపటికే అదే ఆసుపత్రికి భర్త మృతదేహాన్ని తీసుకురావడం విషాదాన్ని నింపింది. కన్నబిడ్డను చూడకుండానే ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.
Minimum Wage For Temple Priests: ఏపీ అర్చకులకు కనీస వేతనాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15,625 రూపాయలు కనీస వేతనం అమలుకు సంబంధించి దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..
Chandrababu Naidu Gets Anticipatory Bail in Angallu Case: అంగళ్లు కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని తీర్పును వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
TTD Sanitation Workers Salaries Hike: పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐదు వేల మంది కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
BRS Vikarabad Meeting: ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఊదరగొట్టే ఉపన్యాసాలతో ప్రజలు ఆగం కావద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎవరితో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించి.. ఓటు వేయాలని కోరారు.
CM Jagan Lay Foundation For Food Processing Units and Industries: రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్‌లకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మూడు కంపెనీలు ప్రారంభించారు.
Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
Mekapati Chandrasekhar Reddy Comments: ఆస్తి పంపకాల్లో తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అన్న రాజమోహన్ రెడ్డి, తమ్ముడు రాజారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Chandrababu Naidu Latest News: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కస్టడీని మరో 11 రోజులు పొడగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆదివారం కస్టడీ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. దీంతో ఆయన అక్టోబర్ 5వ తేదీ వరకు రాజమండ్రి జైలులో ఉండనున్నారు.
Botsa Satyanarayana On Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేస్తోందన్నారు. తమకు ఎవరిపైనా ప్రేమ, ద్వేషం లేవన్నారు.
AP Assembly Sessions Latest Updates: చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఆందోళన మొదలు పెట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టి.. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పగా.. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.