/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

అమరావతి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రైతులు పంట అమ్ముకుని వారాలు గడుస్తున్నప్పటికీ.. వారికి ప్రభుత్వం నుంచి పంట సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు సంక్షేమం, రైతు భరోసా అంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కార్.. ఇప్పుడు కనీసం బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఈ రోజు వరకు మొత్తం రూ.2016 కోట్ల మేర పంట సొమ్ము చెల్లించాల్సి ఉందని.. ఏ రోజుకు ఆరోజు ఈ మొత్తం పెరుగుతూ వస్తోందని అన్నారు. లక్ష మందికిపైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖలు ఏమి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. ఇకనైనా రైతులు అమ్మిన పంటకుగాను వారికి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరచిపోయింది. దీంతో ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నారు. ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో డిసెంబర్ నెలలోనే రైతు సౌభాగ్య దీక్ష ద్వారా వెల్లడించామని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కోసం అసలు నిధులను కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో రైతాంగానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ నిలదీశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Section: 
English Title: 
Pawan Kalyan questions AP govt over pending bills to farmers those who sold crop to govt
News Source: 
Home Title: 

ఆ రైతులకు ఏపీ సర్కార్ రూ.2,016 కోట్లు బాకీ: పవన్ కళ్యాణ్

ఆ రైతులకు ఏపీ సర్కార్ రూ.2,016 కోట్లు బాకీ: పవన్ కళ్యాణ్
Caption: 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆ రైతులకు ఏపీ సర్కార్ రూ.2,016 కోట్లు బాకీ: పవన్ కళ్యాణ్
Publish Later: 
Yes
Publish At: 
Tuesday, February 18, 2020 - 20:54