భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఢిల్లీలో భేటీ కానున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరోక్షంగా చురకలు అంటించారు. "భారతీయ జనతా పార్టీ దేశానికి ఎంత సేవ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం ఇంకా బీజేపీ ఏం చేసిందనే ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏం చేసిందనేది మీరే లెక్కపెట్టుకోవాలి రాహుల్ బాబా" అంటూ అమిత్ షా మరోసారి రాహుల్ గాంధీని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. " మీకు (రాహుల్ గాంధీ) ఇటాలియన్ భాషలో చెబితే కానీ అర్థం కాదేమో కానీ మీకు ఇటాలియన్ భాషలో చెప్పడానికి తనకు ఆ భాష రాదు" అంటూ రాహుల్పై అమిత్ షా సెటైర్లు వేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధంకండి అని మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చిన మరుసటి రోజే బీజేపీపై శివసేన విమర్శలు గుప్పించింది.
హైదరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.
మిత్రపక్షాలను కూడగట్టేందుకు దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న అమిత్ షా ఇప్పుడు బీహార్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జేడీయూ, బీజేపీల మధ్య సంబంధాలు కొంచెం బలహీనమయ్యాయనే వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి నిజంగానే ధైర్యముంటే ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్ నుండి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్హదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.