అమిత్ షా రామ మందిరం గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు: బీజేపీ

హైదరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.

Last Updated : Jul 15, 2018, 05:20 PM IST
అమిత్ షా రామ మందిరం గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు: బీజేపీ

హైదరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వ్యాఖ్యలు అమిత్ షా చేయలేదని బీజేపీ పార్టీ శ్రేణులు వివరణ ఇస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఓ పోస్టు పెట్టాయి.

"నిన్న తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రామ మందిరానికి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. కానీ నిజానికి ఆయన అలాంటి వ్యాఖ్యలు ఏమీ లేదు, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఏ విషయం కూడా ఆ సమయంలో పార్టీ అజెండాలో లేదు" అని ట్విటర్‌‌లో బీజేపీ ప్రతినిధులు ట్వీట్ చేశారు. కాగా, అమిత్ షా రామమందిరానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారని తెలియడంతో ఎంఐఎం ప్రతినిధి‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, అమిత్ షా పై బహిరంగంగానే విమర్శలు చేశారు. 

"అమిత్ షా మాట్లాడుతూ ఎన్నికలకు ముందే రామ మందిరం నిర్మిస్తారని చెప్పినట్లు తెలిసింది. ఇక అయోధ్య విషయంలోనూ ఆయనే తీర్పు ఇస్తారా.. లేక ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకి వదిలేస్తారా అన్నది ఆలోచించాలి. ఏదేమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాతే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే మంచిది. అలా చేయడం వల్ల ఎన్నికలు కూడా పారదర్శకంగా జరుగుతాయని భావిస్తున్నాం" అని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. 

Trending News