Trump versus China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజంగా మొండి వ్యక్తి. ఆరు నూరైనా..నూరు ఆరైనా అనుకున్నది చేసి తీరుతారు. పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో సైతం చైనా కంపెనీపై ఆంక్షలు విధించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బిడెన్, కమలా హ్యారిస్ లను ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఆక్రోశం ఎక్కవవుతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్ కోసం అమెరికా మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను కనుగొన్న నేపధ్యంలో..అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా కంపెనీ ( Moderna company ) తో భారీ ఒప్పందమే కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ 150 కోట్ల డాలర్లు..
కరోనా వైరస్ ( corona virus ) మహమ్మారిని అదుపు చేయడంలో భాగంగా రకరకాల మందులు వినియోగిస్తున్నారు. కొన్ని మందులు సత్ఫలితాలనిస్తుంటే మరికొన్ని వికటిస్తున్నాయి. ఓ మందు విషయంలో డోనాల్డ్ ట్రంప్ ( Donal trump ) అనాలోచితంగా వ్యవహరించిన తీరుకు ఫలితం పెద్ద ఎత్తున ప్రాణనష్టం మిగిల్చిందనేది ఆ అధ్యయనం చెబుతున్న మాట..
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America President Donald Trump ) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
అతనికి మళ్లీ కరోనా సోకింది. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఇంకా అతన్ని అంటిపెట్టుకునే ఉంది. సాక్షాత్తూ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఆచరిస్తారు మరి. అందుకే ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
అమెరికా భద్రతా బలగాలు బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి చేసి ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని హతమార్చాయి. సులేమానీని హత్య చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.