Corona virus: అతడికి మళ్లీ పాజిటివ్

అతనికి మళ్లీ కరోనా సోకింది. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఇంకా అతన్ని అంటిపెట్టుకునే ఉంది. సాక్షాత్తూ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఆచరిస్తారు మరి. అందుకే ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది.

Last Updated : Jul 23, 2020, 12:52 PM IST
Corona virus: అతడికి మళ్లీ పాజిటివ్

అతనికి మళ్లీ కరోనా సోకింది. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఇంకా అతన్ని అంటిపెట్టుకునే ఉంది. సాక్షాత్తూ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఆచరిస్తారు మరి. అందుకే ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ( Brazil president Bolsonaro ) కు ఈసారి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. రెండు వారాల  అనంతరం చేసిన ఫాలో అప్ పరీక్షల్లో కూడా కరోనా పాజిటివ్ ( Tested positive ) గా తేలడంతో మరోసారి క్వారంటైన్ ( Quarantine ) కు వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు వారాల్లో అధికారిక కార్యక్రమాల్ని వాయిదా వేసుకున్నారు. 

వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald Trump ) వ్యవహరించినట్టే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కరోనాను చాలా తేలికగా తీసుకున్నారు. సాధారణ ఫ్లూగా అభివర్ణించిన సందర్భం కూడా ఉంది. రెండు వారాల క్రితం తొలిసారి పాజిటివ్ గా వచ్చినప్పుడు వైద్య ఆరోగ్య సంస్థలు సూచించినదేదీ ఆయన పాటించలేదు. అంతకు ముందు కూడా మాస్క్ ధరించడం నుంచి, సామాజిక దూరాన్ని పాటించడం వరకూ ఏదీ ఆచరించలేదు. పార్టీల్లో అందరినీ కలుస్తూ..షేక్ హ్యాండ్ లు ఇవ్వడం, హగ్ ఇవ్వడం తరచూ చేశారు.  తొలిసారి జూలై 7వ తేదీన ఆయనకు కరోనా సోకింది. రెండు వారాల అనంతరం కూడా ఇప్పుడు మరోసారి చేసిన పరీక్షల్లో కూడా పాజిటివ్ గానే వచ్చింది. Also read; Donald Trump: చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధం

బ్రెజిల్ ( Brazil ) లో ఇప్పటివరకూ 2.2 మిలియన్ కరోనా కేసులు  నమోదు కాగా 80 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా కేసుల్లో బ్రెజిల్ దేశం ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. Also read: Floods: అస్సోంలో కొనసాగుతున్న వరద ఉధృతి

Trending News