ఆంధ్ర ప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. త్వరలోనే ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంకు సచివాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏపీ సచివాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.
రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో క్రమక్రమంగా పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నేడు బీజేపి, జనసేన పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఏపీ రాజధాని అంశాన్ని తేల్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( BCG ) తుది నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జీఎన్ రావు కమిటీ తరహాలోనే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు అనుగుణంగా రిపోర్టులో పలు అంశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని మార్పు అంశాన్ని తేల్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ .. BCG తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన ప్రకటన అనంతరం రైతుల ఆందోళనలకు వేదికగా మారిన అమరావతిపై త్వరలోనే ఏపీ సర్కార్ నుంచి మరో ప్రకటన వెలువడనుందనే వార్తలు వెలువడుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులకు మేలు చేకూర్చేలా ఆ ప్రాంతాన్ని వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్‌గా తీర్చిదిద్దేలా అక్కడ ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.
ఏపీకి మూడు రాజధానుల ప్రకటన, అమరావతి నుంచి రాజధాని మార్పు వంటి అంశాలు తెలంగాణలోకి పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు అనుకూలంగా మారుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలియజేస్తూ ఏపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు ఒక్క రోజు మౌన దీక్ష చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ఎక్కడైతే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారో.. అదే చోట నేడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు దిగారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా నేడు రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, రైతుల ఆందోళనలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాలకు చెందిన నాయకులతో ఈ నెల 30న మంగళవారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలియజేశారు. ఈ మేరకు పార్టీ సైతం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారా అనే సందేహాల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రైతులు ఆందోళనలు చేపట్టి రోడ్డెక్కగా.. వారితో మొదటి నుంచి గొంతు కలుపుతూ వస్తోన్న టీడీపీ మంగళవారం రాత్రి అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది.
అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.