అమరావతి: ఏపీకి మూడు రాజధానుల వివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ భిన్నంగా స్పందించారు. రాజధాని విషయంలో కేంద్రం తప్పనిసరిగా స్పందించాలని వ్యాఖ్యానించారు. ఓవైపు అధికార వైఎస్సార్‌సీపీ మూడు రాజధానుల పనుల్లో నిమగ్నం కాగా, ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమరావతిలోనే రాజధానిని నిర్మించాలని పట్టుపడుతోంది. మరోవైపు రాజధాని గ్రామాల రైతులు తమకు అన్యాయం చేయోద్దంటూ నిరసనని కొనసాగిస్తున్నారు.
పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం అఖిలపక్ష నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.
మరోవైపు రాజధాని రైతుల సమస్యలపై స్పందించేందుకు జనసేన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 20వ తేదీలోగా జనసేన కవాత్ చేయనుందని పార్టీ వర్గాల సమాచారం. రాజధాని విషయంపై స్పష్టత తేవడంలో భాగంగా కవాత్ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పవన్ భావిస్తున్నారట. ఏపీ కేబినెట్ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై కవాత్ ఆధారపడి ఉంటుందన‍్న వాదనలు వినిపిస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..