అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు బయలుదేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాజధానులపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాలినడకన అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది అయిదు కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా చూస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి మూడు రాజధానులు అవ్వకుండా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని, రాష్ట్ర ప్రజలు తమ మద్దతు తెలపాలని కోరారు. రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులు, ప్రజలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.
'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని'. మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో అసెంబ్లీ ముందు నిరసన తెలిపాం.#SaveAmaravati#MyCapitalAmaravati #APWithAmaravati pic.twitter.com/AmpyKDbx9V
— Lokesh Nara (@naralokesh) January 20, 2020
కాగా, మరోవైపు ఏపీ కేబినెట్ ముగిసింది. రాజధానులపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదికపై మంత్రి వర్గం చర్చించింది. మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చ జరిగింది. రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..