ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నడ్డి విరిచి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించినవారెవరో అందరికీ తెలుసు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ- నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించింది.
ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మంగళవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం న్యూదిల్లీకి వచ్చిన ఆయన ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఆఫ్ఘన్ లో భద్రత, ఉగ్రవాదంతో సహా పలు కీలక అంశాల మీద చర్చించనున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి చర్చలు జరుపుతారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో దక్షిణ కాందహార్ ప్రాంతంలో తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైనికులకు మధ్య జరిగిన ఎదురుదాడి కాల్పుల్లో 43 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనలో తాలిబన్లు రెండు సుసైడ్ కారు బాంబులను ఉపయోగించినట్లు సమాచారం. అయితే పరస్పరంగా జరిగిన కాల్పుల్లో 10 మంది తాలిబన్లు మరణించినట్లు తెలుస్తోంది. తాలిబన్లు ఈ దాడిని తామే చేసినట్లు ఇప్పటికే మీడియా స్టేట్మెంట్ అందించారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులకు హెలీకాఫ్టర్లను సరఫరా చేస్తూ, వారికి మద్దతిస్తూ, ఏమీ తెలియని నంగనాచిలా అమెరికా ప్రవర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.