కాబుల్ జంట పేలుళ్లలో 21 మంది మృతి

అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి.

Last Updated : Apr 30, 2018, 12:46 PM IST
కాబుల్ జంట పేలుళ్లలో 21 మంది మృతి

అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. కాబూల్‌లో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 20మందికి పైగా మంది మృతి చెందారు. వీరిలో నలుగురు జర్నలిస్టులు ఉన్నారు. ఏజెన్స్‌ ఫ్రాన్స్‌-ప్రెస్‌కు చెందిన చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ షా మారై, మరొక ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇది ఐఎస్ఐఎస్ తాలిబాన్ ఉగ్రవాదుల పనే అని పోలీసులు భావిస్తున్నారు.
 
ఈ దాడిలో మరొక 30 మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి వాహిద్‌ మజ్రోహ్‌ చెప్పారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మజ్రోహ్‌ అన్నారు. షష్దారక్ ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయని అన్నారు. మొదటిసారి ఆత్మాహుతి దాడి తరువాత స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టిన సమయంలో రెండవ ఆత్మాహుతి దాడి జరిగింది.

Trending News