భుట్టో మరణానికి లాడెన్ కారకుడా..?

ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడన్న అంశంపై ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు విదేశీ మీడియాలో నడుస్తోంది.

Last Updated : Dec 28, 2017, 01:51 PM IST
భుట్టో మరణానికి లాడెన్ కారకుడా..?

ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడన్న అంశంపై ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు విదేశీ మీడియాలో నడుస్తోంది. మాజీ పాక్ ప్రధానులైన బెన్‌జీర్ భుట్టోతో పాటు పర్వేజ్ ముషారఫ్‌లను చంపడానికి ప్లాన్ రచించడానికే ఆయన అక్కడికి వెళ్ళాడని ఈ మధ్యకాలంలో పలు పత్రికలు రాయడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగానే ఈ వార్తలను ప్రచురించడం జరిగిందని.. అప్పట్లో ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ఈ విషయంపై తమకు సమాచారం అందిందని తెలిపిందని పలు పత్రికా కథనాలు చెబుతున్నాయి.

ఆల్‌ఖైదా పలుమార్లు లాడెన్‌కు కొరియర్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తికి  భుట్టోతో పాటు ముషారఫ్‌ని హత్య చేసే బాధ్యతలు అప్పగించిందని ఆ పత్రికలు చెబుతున్నాయి. డిసెంబరు 27, 2007 తేదిన భుట్టో రావల్పిండి ప్రాంతంలో ఓ బాంబు ప్రేలుడులో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాంబు ప్రేలుడుకి.. ఒసామాకి ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా ఆలోచించాల్సి ఉందని పలు పత్రికలు వార్తలు రాశాయి.

ఆ మరణానికి సంబంధించి లాడెన్ పాత్రకు బలాన్ని చేకూర్చే పలు ఉత్తరాలు ఇప్పటికే ఆయన ఇంటిలో దొరికాయని.. అలాగే ఈ విషయంలో ఐఎస్‌ఐ పాకిస్తాన్‌ను ముందుగానే హెచ్చరించిందని కూడా వార్తలు వస్తున్నాయి. భుట్టో మరణానికి కొద్ది రోజుల ముందే పాకిస్తాన్‌లోని మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టరేటుకి ప్రధాని భద్రత విషయమై సమాచారం అందిందని.. అలాగే భుట్టో మరణించాక ఒక అఙ్ఞాత లేఖ లాడెన్ కు అందిందని.. ఆ లేఖలో "జామియా హఫ్సా, లాల్ మసీదుకు చెందిన మన సోదర సోదరీమణుల తరఫున పగ తీర్చుకోవడం జరిగింది" అని రాసి ఉందని పత్రికలు వెల్లడించాయి. ఇటీవలే ఆ లేఖ లాడెన్ నివాసంలో దొరికినట్లు చెబుతున్నాయి. మే 2011 నెలలో పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో అమెరికన్ నావిక దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన విషయం మనకు తెలిసిందే.

Trending News