Jio Offers Unlimited Internet: రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.
Reliance Jio | టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పోటీ కంపెనీలకు షాకుల షాకులిస్తూ వచ్చిన జియో తాజాగా తమ వినియోగదారులకు షాకిచ్చింది. జియో అతి తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.98 కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో వెనక్కి తీసుకుంది.
భారతీయ టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకు నిత్యం 1జీబీ డేటా అందించే అన్ని టారిఫ్‌లని పునఃసమీక్షించనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. నేటి నుంచి కొత్త టారిఫ్ లు అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం ఇప్పటివరకు వున్న ధరకన్నా రూ.50 తక్కువ చార్జ్ చేయడం ఒక విధానం అయితే, అదే పాత ధరకు 50 శాతం డేటాను అధికంగా అందించడం మరో విధానం. వినియోగదారులు ఎంచుకున్న విధానాన్నిబట్టి ఆయా టారిఫ్ లు వర్తించనున్నట్టు జియో పేర్కొంది.
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో.. వినియోగదారుల కోసం తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ధన్ ధనా ధన్ ఆఫర్ తో తక్కువ ధరకే డేటా అందిస్తున్న జియో..దీపావళి పండగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. ఈ ఆఫర్లో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ బంపర్ ఆఫర్ ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది.
వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్
రిలయన్స్ జియో 4జీ వినియోగదారులకు ఒక చేదు నిజం... "జియో 4జీ స్మార్ట్ ఫోన్ కొన్నవారు ఇకనుండి తప్పనిసరిగా సంవత్సరానికి 1500 రూపాయలు చొప్పున మూడేళ్లపాటు 4500 రూపాయలతో తప్పనిసరిగా రీచార్జ్ చేసుకోవాలి. లేకపోతే మీరు కట్టిన అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు రూ.1500 వాపసురాదు. అంతేకాదు ఫోన్ రిటర్న్ చేస్తే జీఎస్టీ బాదుతాము" అని జియో తన అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.