Jio Offers: రూ.100 లోపు రిలయన్స్ జియో అందిస్తున్న Unlimited Offers ఇవే

Jio Offers Unlimited Internet:  రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్‌టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 21, 2021, 01:36 PM IST
Jio Offers: రూ.100 లోపు రిలయన్స్ జియో అందిస్తున్న Unlimited Offers ఇవే

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలని టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్‌టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.

జియో రూ.39 రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.39 రీఛార్జ్ ప్లాన్. వినియోగదారులకు అపరిమిత కాలింగ్ సౌకర్యం కల్పిస్తుంది. దాంతోపాటు ప్రతిరోజూ 100 ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. కాగా, ఓవరాల్‌గా 1400 ఎంబీ వరకు హైస్పీడ్ డేటా బ్రౌజింగ్ సదుపాయం కల్పించింది. రోజు లిమిట్ 100 ఎంబీ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ అవుతుంది.

Also Read: Gold Price Today 21 May 2021: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు

జియో రూ.69 రీఛార్జ్ ప్లాన్
కేవలం రూ.100 లోపు రిలయన్స్ జియో అందిస్తున్న మరో ప్లాన్ రూ.69. ప్రతిరోజూ 0.5 జీబీ డేటా అందిస్తుంది. మొత్తంగా 7 జీబీ ఇంటర్నెట్ హైస్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. ఒకవేళ రోజువారీ డేటా పూర్తయ్యాక 64 కేబీపీఎస్ వేగంతో బ్రౌజింగ్ చేయవచ్చునని తెలిపింది. 

తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ అందించడంతో పాటు రిలయన్స్ జియో జియోఫోన్ కస్టమర్లకు 300 నిమిషాలు ఉచిత కాలింగ్ నిమిషాలను ఇస్తుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రీఛార్జ్ చేసుకోలేని జియోఫోన్ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని కల్పింస్తున్నట్లు తెలిపింది. ప్రతిరోజూ 10 ఉచిత కాలింగ్ నిమిషాలు అందిస్తుంది. రియలన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంలో ఈ సేవలు అందించాలని జియో నిర్ణయం తీసుకుంది.

Also Read: TS SSC Results 2021: తెలంగాణలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ మీకోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News