కస్టమర్లకు షాకిచ్చిన Jio.. ఆ రీఛార్జ్‌పై మరో 31శాతం వాత

Reliance Jio | టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పోటీ కంపెనీలకు షాకుల షాకులిస్తూ వచ్చిన జియో తాజాగా తమ వినియోగదారులకు షాకిచ్చింది. జియో అతి తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.98 కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో వెనక్కి తీసుకుంది.

Last Updated : May 25, 2020, 04:55 PM IST
కస్టమర్లకు షాకిచ్చిన Jio.. ఆ రీఛార్జ్‌పై మరో 31శాతం వాత

టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పోటీ కంపెనీలకు షాకుల షాకులిస్తూ వచ్చిన జియో తాజాగా తమ వినియోగదారులకు షాకిచ్చింది. జియో అతి తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.98 కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో వెనక్కి తీసుకుంది. దీనికి బదులుగా రూ.129 కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.   బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

28 రోజులపాటు వాలిడిటీ ఉండే అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్‌ను లాక్‌డౌన్ సమయంలో తీసేయడంతో జియో వినియోగదారులకు నష్టమే. కాగా, కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన రూ.129తో రీఛార్జ్ చేసుకుంటే.. జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్, ప్రతిరోజు 300 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా లభిస్తాయి. నాలుగు వారాల వాలిడిటీ ఉంటుంది. అయితే వేరే నెట్‌వర్క్‌ నెంబర్లకు కాల్ చేయాలంటే అదనపు టాప్ అప్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అతి తక్కువ ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్‌పై 31శాతం ధర పెంచడం కస్టమర్లకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.     మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్

లాక్‌డౌన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల కోసం రూ.999 రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 3 జీబీ డేటాను 84 రోజులపాటు వస్తుంది. రూ.599, రూ.399 రీఛార్జ్ ప్లాన్‌లతో రోజుకు 2 జీబీ, 1.5 జీబీ డేటాను జియో అందిస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News