తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత దేశంలో పెళ్లి సంస్కృతి చాలా గొప్పది. భారతీయ వివాహ సంస్కృతిపై విదేశాలు సైతం మక్కువ చూపుతున్నపరిస్థితి ఉంది. ఐతే మన దేశంలో పెళ్లి ఖర్చు కూడా చాలా ఎక్కువే. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు.. పెళ్లి ఆర్భాటాన్ని మరింతగా పెంచుతున్నాయి.
'కరోనా వైరస్' మహమ్మారి విప్పుతున్న జడలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతకంతకు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.
'కరోనా వైరస్' వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ 3.0ను ఎత్తేసే అవకాశం ఉందా..? ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఏం చెప్పనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ క్రమంలో కొన్ని ఆంక్షలతో పారిశ్రామికోత్పత్తి పునః ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
లాక్డౌన్ కారణంగా లక్షలాది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కొద్దిమంది భారత్‌లో ఉండిపోయారు. కొన్ని రోజుల కిందట భారత ప్రభుత్వం రాకపోకలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,666 శాంపిల్స్ పరీక్షించారు.
కాలం గడుస్తున్నకొద్దీ 'కరోనా వైరస్' విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 39 లక్షలకు చేరుకుంది.
వచ్చేది వానాకాలం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతోంది. మంత్రి కేటీఆర్.. ఇవాళ (శనివారం) మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వచ్చే వానాకాలానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలనే దానిపై అధికారులతో చర్చించారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు 45 రోజులకు పైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు.
'కరోనా వైరస్'.. విజృంభిస్తున్న వేళ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు. దేవుడు కరోనా వైరస్ తో కలిసి ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నారని వివాదాస్పద కామెంట్లు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందంటున్న అమెరికా.. ప్రపంచానికి తెలియకుండా చైనా మోసం చేసిందని విమర్శించింది.
విషపూరిత గ్యాస్ లీకేజీ ఘటనతో అతలాకుతలమైన విశాఖ నగరానికి మరో షాక్ తగిలింది. సాగర నగరంలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
'కరోనా వైరస్'ను అడ్డుకునేందుకు ఔషధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 వరకు వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నాయి. అందులో కొన్ని క్లినికల్ ట్రయల్స్‌కు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో తాజాగా మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8వేల శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏపీ వైద్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది.
'కరోనా వైరస్'.. వలస కూలీలకు ఎన్ని కష్టాలు తెచ్చింది. ఉన్న ఊరును వదిలి ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా..! అంటూ వలస వెళ్లిన ఆ కార్మికులకు జానెడు పొట్ట నిండడం కష్టమైపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.