అలా నడుస్తూనే ఉన్నారు..!!

'కరోనా వైరస్'.. వలస కూలీలకు ఎన్ని కష్టాలు తెచ్చింది. ఉన్న ఊరును వదిలి ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా..! అంటూ వలస వెళ్లిన ఆ కార్మికులకు జానెడు పొట్ట నిండడం కష్టమైపోయింది.

Last Updated : May 7, 2020, 12:17 PM IST
అలా నడుస్తూనే ఉన్నారు..!!

'కరోనా వైరస్'.. వలస కూలీలకు ఎన్ని కష్టాలు తెచ్చింది. ఉన్న ఊరును వదిలి ఇతర ప్రాంతాలకు బతుకు జీవుడా..! అంటూ వలస వెళ్లిన ఆ కార్మికులకు జానెడు పొట్ట నిండడం కష్టమైపోయింది.

పనులు లేక ఉపాధి లేక.. వలస ప్రాంతం నుంచి తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. కానీ వారికి అందులోనూ కష్టాలు వెన్నాడుతున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బస్సులు,  రైళ్లు, ప్రయివేట్ వాహనాలు అన్నీ బంద్ అయ్యాయి.  దాదాపు 45 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్ని  రోజుల నుంచి వలస ప్రాంతాల్లో ఉండలేక కూలీలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఐతే వాహన సౌకర్యం ఏమీ లేకపోవడంతో కాలి నడకనే తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ల పేరుతో ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. కానీ అందరు వలస కూలీలకు అవి అందుబాటులోకి   రావడం లేదు. దీంతో చాలా మంది వలస జీవులు ఇప్పటికీ రోడ్ల మీద దర్శనమిస్తున్నారు. ఓ వైపు  పిల్లలు, మరోవైపు లగేజీతో కాళ్లు ఈడ్చుకుంటూ సొంత ప్రాంతాలకు కదులుతున్నారు. 

ముంబై- నాసిక్ జాతీయ రహదారి పొడవునా వలసకూలీలు నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సహా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని వలస కూలీలు చెబుతున్నారు. తమ వద్ద తినడానికి డబ్బులు కూడా లేవంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దిక్కుతోచక సొంతూళ్లకు తిరుగుపయనమయ్యామంటున్నారు. పిల్లలకు కేవలం బిస్కెట్లతో కడుపు నింపుతూ ప్రయాణం సాగిస్తున్నామని చెబుతున్నారు. 

శ్రామిక్ రైళ్లు నడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ తమను సొంతూళ్లకు పంపించాలని వలసజీవులు అధికార యంత్రాంగంతో, పోలీసులతో ఘర్షణ పడుతున్నారు. కానీ పరిస్థితిలో ఏం మార్పు రాకపోవడంతో.. మళ్లీ తమ  పయనం మొదలు పెట్టారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

 

Trending News