'కరోనా వైరస్'.. విజృంభిస్తున్న వేళ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు. దేవుడు కరోనా వైరస్ తో కలిసి ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నారని వివాదాస్పద కామెంట్లు ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.
అంతే కాకుండ విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత కూడా . . జనం అన్నింటినీ విమర్శించారు కానీ.. దేవుడిని మాత్రం ఎవరూ విమర్శించలేదన్నారు. దానికి కారణం దేవుడు అంటే అందరికీ భయమన్నారు. ప్రకృతి విపత్తులను, కరోనా వైరస్ లాంటి వాటిని సృష్టించడంలో బిజీగా ఉన్న దేవుడు కొన్ని మానసిక వ్యాధులను మాత్రం సృష్టించలేదని తాను నమ్ముతున్నట్లు ట్వీట్ చేశారు వర్మ.
మరోవైపు కరోనా వైరస్ పై ఇప్పటికే ఓ పాట రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ.. ఇవాళ మరో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. దేవుడు,కరోనా వైరస్ కలిసి డ్యూయెట్ పాడుకున్నట్లుగా పాట ఉంటుందని ట్వీట్ చేశారు వర్మ. లాక్ డౌన్ లో ఉన్న కారణంగా ఈ పాటను రూపొందించినట్లు తెలిపారు.
Here is a short teaser of the song DEVUDI CORONA where GOD and CORONAVIRUS together sing a DUET SONG..Video releasing 5.20 pm today 💃💃💃 pic.twitter.com/yBaGxiVWdG
— Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2020