తెలంగాణలో ఇప్పటివరకూ కరోనా వైరస్ ఒక్క కేసూ నమోదుకాని జిల్లాలు వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి ఉండగా.. తాజాగా ఓ జిల్లాకు ప్రాణాంతక వైరస్ వ్యాపించింది. నిన్నటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని యాదాద్రి భువనగిరి జిల్లాలో కోవిడ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా యాదాద్రి జిల్లాల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మదర్స్ డే స్పెషల్ సాంగ్స్
ఇప్పటివరకూ కరోనా జిల్లాకు వ్యాపించలేదని సంతోషంగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసులను ఈ 4 పాజిటివ్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలంలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురంలో మరో వ్యక్తికి కరోనా సోకింది. ఈ కరోనా బాధితులంతా ముంబై నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చిన వారని గుర్తించారు. Mahesh Babu డైలాగ్‌తో వార్నర్ మళ్లీ సంచలనం!
అతి ఎక్కువ కేసులు, కరోనా మరణాలు నమోదైన ముంబై నుంచి స్వగ్రామానికి వచ్చిన తర్వాత వీరు ఎవరిని కలుసుకున్నారని వివరాలు కనుక్కున్నారు. వారికి కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!