Squid Game Challenge: 'స్క్విడ్ గేమ్' ఛాలెంజ్‌ విన్నర్స్ గా రోహిత్, షమీ

Squid Game Challenge: 90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ 'స్క్విడ్ గేమ్'. అయితే ఈ వెబ్‌ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సిరీస్ లోని డ‌ల్‌గోనా క్యాండీ ఛాలెంజ్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 09:35 PM IST
Squid Game Challenge: 'స్క్విడ్ గేమ్' ఛాలెంజ్‌ విన్నర్స్ గా రోహిత్, షమీ

Team India Stars Take The 'Squid Game' Challenge: నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో సంచలనం సృష్టిస్తున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ 'స్క్విడ్ గేమ్(Squid Game )'. ఇందులోని డ‌ల్‌గోనా క్యాండీ ఛాలెంజ్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. 

ఈ ఛాలెంజ్‌లో భాగంగా.. క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బ‌తిన‌కుండా బ‌య‌ట‌కు తీయాల్సి ఉంటుంది. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌స్ప్రీత్ బుమ్రా ఈ పోటీల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్‌ చేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

Also Read: T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్

ఇందులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), మహ్మద్‌ షమీ(Shami)లు విజేతలుగా నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. హిట్‌మ్యానా మజాకా అంటూ అతని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో పక్క  షమీపై సైతం నెటిజన్లు పొగడ్తల వర్షం​ కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021(T20 World Cup 2021)లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌(Pakistan)తో త‌ల‌ప‌డ‌నున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు నమోదు చేసిన కోహ్లి సేన మాంచి జోరు మీదుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News