Washington Sundar: వాషింగ్టన్ సుందర్ కు కరోనా... దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అనుమానం!

Washington Sundar: టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సందర్ కరోనా బారిన పడ్డారు. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 04:04 PM IST
Washington Sundar: వాషింగ్టన్ సుందర్ కు కరోనా... దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అనుమానం!

Washington Sundar Tests COVID-19 Positive: టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సందర్ కరోనా బారిన పడ్డారు. దీంతో జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ (SA vs IND) కు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఇతర జట్టు సభ్యులతో కలిసి ఈ 22 ఏళ్ల స్పిన్నర్ కేప్ టౌన్ వెళ్లకపోవచ్చని ప్రముఖ స్పోర్ట్స్ సైట్ క్రిక్ బజ్ తెలిపింది. దీనిపై స్పందించేదుకు సుందర్ (Washington Sundar) నిరాకరించినట్లు పేర్కొంది. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (BCCI President Ganguly) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

రెండేళ్లుగా దేశీయ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సుందర్ (Washington Sundar).. ప్రోటీస్ తో సిరీస్ లో తనదైన ముద్ర వేయాలనుకున్నాడు. ఇది అతని కెరీర్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సెలెక్టర్లు సుందర్ కోలుకునే దాకా వేచి చూస్తారా లేదా మరోకరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అవకాశం ఇస్తే సత్తా చాటాలని వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ లాంటి ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఈ వన్డే సిరిస్ కు రాహుల్ (KL Rahul) కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు.

Also Read: IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికె), వై చాహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మాద్ సిరాజ్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News