మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు.                             

Last Updated : Aug 5, 2018, 02:04 PM IST
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఖాతాలో ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ టెస్టుల్లో 22 సెంచరీలు చేసినట్లయింది. సచిన్ తన కెరీర్‌లో 22 టెస్టు సెంచరీలు 114 ఇన్నింగ్స్‌లో పూర్తి చేయగా..ఈ  ఫీట్‌ను కోహ్లీ 113వ ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. దీంతో అత్యంత వేగంగా ఈ ఫీట్ చేరుకున్న ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది. 

కేవలం 58 ఇన్నింగ్స్2లో ఈ ఘనత సాధించిన డొనాల్డ్ బ్రాడ్మన్ అగ్రస్థానంలో నిలవగా..  గవాస్కర్ (101 ఇన్నింగ్స్), స్టీవ్ స్మిత్ (108 ఇన్నింగ్స్) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు..తాజాగా కోహ్లీ (113 ఇన్నింగ్స్) సచిన్‌ను వెనక్కి నెట్టి నాల్గో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సచిన్ (114 ఇన్నింగ్స్) ఐదో స్థానంలో ఉన్నాడు

నూరు శతకాల రికార్డు కోహ్లీకి సాధ్యమే..

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 100 శతకాల రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కాగా ఈ రికార్డును కోహ్లీ అధిగమించగలడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 57 సెంచరీలు పూర్తి చేశాడు . వయస్సుతో పాటు  సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే  ఫిట్‌నెస్ కోహ్లీ సొంతం. కోహ్లీ జోరు ఇలాగే కొనసాగితే అసాధ్యమనుకున్న రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Trending News