Dinesh Karthik: ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా దినేశ్ కార్తీక్.. తొలి స‌వాల్ మనతోనే...!

Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించనున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 12:01 PM IST
Dinesh Karthik: ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా దినేశ్ కార్తీక్.. తొలి స‌వాల్ మనతోనే...!

India vs england 2024 Test Series: భార‌త మాజీ క్రికెట‌ర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik ) కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. కార్తీక్ ఇంగ్లండ్ లయ‌న్స్‌(England Lions) జ‌ట్టుకు కోచ్‌గా అతను వ్యవహారించనున్నాడు. గత కొంతకాలంగా కామెంటేట‌ర్‌గా అద‌ర‌గొడుతున్న కార్తీక్ కోచ్ గా ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి. భార‌త ‘ఏ’ జట్టుతో ఇంగ్లీష్ జ‌ట్టు మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ ను ఆడనుంది. ఈ నేపథ్యంలో లయన్స్ జట్టు కార్తీక్‌ను బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌(Battind Consultant)గా తీసుకుంది. 2022లో జరిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తోపాటు ఐపీఎల్ 16వ సీజన్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు కార్తీక్. ఆ తర్వాత ఇతడిని జట్టులోకి తీసుకోలేదు మేనెజ్ మెంట్.

జ‌న‌వ‌రి 12న భార‌త ఏ జ‌ట్టుతో ఇంగ్లండ్ ల‌య‌న్స్ టీమ్ తొలి వామ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. దీని తర్వాత జ‌న‌వరి 17న నాలుగు రోజుల మ్యాచ్ అహ్మ‌దాబాద్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 13 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. భార‌త ఏ జ‌ట్టుకు కెప్టెన్ గా బెంగాల్ ఒపెన‌ర్ అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్(Abhimanyu Easwaran) వ్యవహారించనున్నాడు. 

Also Read: BCCI Awards: హైదరాబాద్ వేదికగా బీసీసీఐ అవార్డుల వేడుక, హాజరుకానున్న స్టార్ ఆటగాళ్లు

భార‌త ఏ జ‌ట్టు స్క్వాడ్ : అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్(కెప్టెన్), సాయి సుద‌ర్శ‌న్‌, రజ‌త్ ప‌టిదార్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ప్ర‌దోశ్ రంజ‌న్ పౌల్, కేఎస్ భ‌ర‌త్(వికెట్ కీప‌ర్), మ‌న‌వ్ సుథార్, పుల్కిత్ న‌రంగ్, న‌వ్‌దీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వ‌త్ క‌వెర‌ప్ప‌, ధ్రువ్ జురెల్, అకాశ్ దీప్.
ఇంగ్లండ్ లయన్స్ స్క్వాడ్: జోష్ బోహన్నన్ (సి), కేసీ ఆల్డ్రిడ్జ్, బ్రైడన్ కార్సే, జాక్ కార్సన్, జేమ్స్ కోల్స్, మాట్ ఫిషర్, కీటన్ జెన్నింగ్స్, టామ్ లావ్స్, అలెక్స్ లీస్, డాన్ మౌస్లీ, కల్లమ్ పార్కిన్సన్, మాట్ పాట్స్, ఒల్లీ ప్రైస్, జేమ్స్ రెవ్ మరియు ఆలీ రాబిన్సన్.

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు ‘స్పోర్ట్స్ హెర్నియా’.. స‌ర్జ‌రీ కోసం జర్మనీకి వెళ్లనున్న స్టార్ ప్లేయర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News