Smriti Mandhana WPL: డ‌బ్ల్యూపీఎల్ వేలంలో స్మృతి మంధానకు భారీ ధర.. ఈలలు, కేకలు వేసిన భారత అమ్మాయిలు!

India Women Players enjoys Smriti Mandhana's Auction. స్మృతి మంధాన కోసం ప్రాంఛైజీలు పోటీ పడుతుంటే.. డ్రెసింగ్ రూంలో లైవ్ చూసిన భారత క్రికెట్ జట్టు అమ్మాయిలు సందడి చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 13, 2023, 07:01 PM IST
  • డ‌బ్ల్యూపీఎల్ వేలంలో మంధానకు భారీ ధర
  • ఈలలు, కేకలు వేసిన భారత అమ్మాయిలు
  • వీడియో చూడాల్సిందే
Smriti Mandhana WPL: డ‌బ్ల్యూపీఎల్ వేలంలో స్మృతి మంధానకు భారీ ధర.. ఈలలు, కేకలు వేసిన భారత అమ్మాయిలు!

Smriti Mandhana Reaction goes viral after signing with RCB: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డ‌బ్ల్యూపీఎల్) 2023లో భారత వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానకు అత్యధిక ధర పలికింది. ముంబై వేదికగా జరిగిన మొదటి మహిళల ఐపీఎల్‌ మెగా వేలంలో మంధానను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 3.4 కోట్లకు సొం‍తం చేసుకుంది. మంధాన కోసం ముంబై ఇండియన్స్‌, బెంగళూరు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. రసవత్తరంగా సాగిన వేలంలో చివరకు మంధానను బెంగళూరు రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది.

డ‌బ్ల్యూపీఎల్ 2023 వేలం స్మృతి మంధానతోనే మొదలైంది. మంధాన కోసం ముంబై ఇండియన్స్‌, బెంగళూరు ప్రాంఛైజీలు పోటీ పడుతుంటే.. డ్రెసింగ్ రూంలో లైవ్ చూసిన భారత క్రికెట్ జట్టు అమ్మాయిలు సందడి చేశారు. మంధాన ధర పెరుగుతుంటే.. ఈలలు, కేకలు వేస్తూ అల్లరి చేశారు. తన ధర పెరుగుతుంటే మంధాన సంతోషపడింది. ఇక బెంగళూరు సొంతం చేసుకోగానే లేచి సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకుంది. ఇందుకు సంబందించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

స్మృతి మంధాన కనీస ధర రూ. 50 లక్షలు కాగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టుకు మంధాన కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. మంధాన ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్‌పై టీ20 అరంగేట్రం చేసింది. కెరీర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ భారత జట్టులో కీలకంగా మారింది. టీ20 ఫార్మాట్‌లో మంధాన 112మ్యాచ్‌లు ఆడి 27.3 సగటుతో 2651 పరుగులు చేసింది. ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మంధాన ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు 86.

స్మృతి మంధాన ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టీ20 రికార్డులు ఆమె బ్యాటింగ్ నైపుణ్యాల గురించి చెబుతాయి. 2018లో మంధాన టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారతీయ మహిళగా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌'గా కూడా ఎంపికైంది. మంధాన తన దూకుడైన బ్యాటింగ్‌తో టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు అనేక విజయాలు అందించింది. మంధాన భారత్ తరఫున 4 టెస్టులు, 77 వన్డేలు, 112 టీ20లు ఆడింది. 

Also Read: Hardik Pandya Marriage: మరోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే!  

Also Read: Jemimah Rodrigues Price: జాక్‌ పాట్‌ కొట్టిన జెమియా రోడ్రిగ్స్‌.. బెత్ మూనీ, నాట్ సీవర్‌ని వారించిన అదృష్టం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News