DC Vs GT Highlights: IPL చరిత్రలోనే డేంజర్ బాల్.. దెబ్బకు గిల్ క్లీన్‌బౌల్డ్.. వీడియో వైరల్

Shubman Gill Out Video Got Viral: ఢిల్లీ బౌలర్ నోకియా డేంజర్‌బాల్‌తో గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. గంటకు 148.8 వేగంతో వేసిన ఈ బంతికి గిల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 04:12 PM IST
DC Vs GT Highlights: IPL చరిత్రలోనే డేంజర్ బాల్.. దెబ్బకు గిల్ క్లీన్‌బౌల్డ్.. వీడియో వైరల్

Shubman Gill Out Video Viral in Social Media: ఐపీఎల్‌లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సిక్సర్లు, ఫోర్లతో ప్రేక్షకులను బ్యాట్స్‌మెన్లు అలరిస్తున్నారు. మంగళవారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఢిల్లీని 6 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది గుజరాత్. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నోకియా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌ను వరుస ఓవర్లలో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా గిల్‌కు వేసిన బంతి నెక్ట్స్‌ లెవెల్ అని చెప్పొచ్చు. 

శుభ్‌మాన్ గిల్‌ను ప్రమాదకరమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి కంటే నోకియా వేసిన ఈ బంతి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బాల్స్‌లో ఇది ఒకటి అని నెటిజన్లు అంటున్నారు. నోకియా వేసిన ఈ బంతి ముందు శుభ్‌మన్ గిల్ వద్ద సమాధానం లేదు. నేరుగా స్టంప్స్‌ను పడగొట్టింది. 

ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. నోకియా బౌలింగ్‌లో 14 పరుగులకే ఔటయ్యాడు. అప్పటికే తన మొదటి ఓవర్‌ మొదటి బంతికే వృద్ధిమాన్ సాహాను క్లీన్‌బౌల్డ్ చేయగా.. రెండో ఓవర్‌ మొదటికే బంతి గిల్‌ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు. గంటకు 148.8 వేగంతో ఈ బాల్ వేశాడు. 

Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. వార్నర్ (37), సర్ఫరాజ్ ఖాన్ (30), అక్షర్ పటేల్ (36) రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. పవర్‌ప్లే ముగిసేసరికి 54 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో సాయి సుదర్శన్ (62), విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (31) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో గుజరాత్ విజయం సాధిచింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.

Also Read: KKR vs RCB IPL 2023 9th Match Live Updates: చెలరేగిన కోల్‌కతా స్పిన్నర్లు.. బెంగళూరుకు ఘోర పరాభవం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News