2024 India cricket schedule: 2024లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది.. 13 ఏళ్ల కల ఈ సారైనా నెరవేరేనా?

India Cricket Schedule in 2024: గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. 2023లో అసాధారణ విజయాలు సాధించింది. అదే ఉత్సాహంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 02:58 PM IST
2024 India cricket schedule: 2024లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది.. 13 ఏళ్ల కల ఈ సారైనా నెరవేరేనా?

Indian men'’s cricket team schedule 2024: కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించేందుకు టీమిండియా రెడీ అవుతోంది. గతేడాది భారత జట్టు అద్బుతంగా రాణించింది. వన్డే ప్రపంచకప్ చేజారినప్పటికీ భారత ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని ఇండియన్ ఫ్యాన్ ఆశిస్తున్నారు. 

భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ 2024:
ఇండియా v సౌతాఫ్రికా
గత ఏడాది డిసెంబరులో మెుదలైన దక్షిణాఫ్రికా పర్యటన త్వరలోనే ముగియనుంది. తొలి టెస్టులో  టీమిండియా ఓడింది. రెండవ లేదా చివరి టెస్టు జనవరి 03 నుంచి కేప్ టౌన్‌ వేదికగా జరగనుంది. 
ఇండియా v ఆఫ్ఘ‌నిస్థాన్ (హోమ్ సిరీస్‌)
సఫారీతో సిరీస్ ముగిసిన వెంటనే స్వదేసంలో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ఆరంభం కానుంది. 
** ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్- జనవరి 19-ఫిబ్రవరి 11(దక్షిణాఫ్రికాలో)
ఇండియా v ఇంగ్లండ్ (స్వదేశంలో)
స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది భారత్ జట్టు. జ‌న‌వ‌రి 25న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 11న జరగుతుంది. వేదికలు- హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల.
** మార్చి-జూన్ - ఐపీఎల్ 2024
టీ20 ప్రపంచకప్
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వెస్టిండీస్‌, అమెరికాకు వెళ్లనుంది. ఈ మెగా టోర్నీ జూన్ 4 నుంచి  జూన్ 30 వరకు జరుగుతుంది. 

Also Read: David Warner: న్యూఇయర్ రోజు షాకిచ్చిన ఆసీస్ స్టార్ ఓపెనర్.. వ‌న్డేల‌కు వార్నర్ గుడ్ బై..

శ్రీలంక v ఇండియా
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తిరిగి వచ్చాక టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. ఈ మ్యాచులు జూలైలో జరగనున్నాయి. 
ఇండియా v బంగ్లాదేశ్ (స్వదేశంలో)
ఆ తర్వాత సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. షెడ్యూల్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.
ఇండియా v న్యూజిలాండ్ (స్వదేశంలో)
అనంతరం అక్టోబరులో స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది భారత జట్టు. 
ఆస్ట్రేలియా v ఇండియా
2024 చివరల్లో అంటే నవంబరు, డిసెంబరు నెలల్లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనుంది టీమిండియా. అక్కడ ఆసీస్ తో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన డేట్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 

Also Read: 2023 Sports Events:2023లో మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News