World Cup Points: పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రన్‌రేట్ కారణంగా రెండవ స్థానంలోనే ఇండియా

World Cup Points: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నా టీమ్ ఇండియా ఇంకా రెండవ స్థానంలోనే నిలిచింది. ఒక మ్యాచ్ ఓడిన దక్షిణాఫ్రికా మాత్రం అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఏ జట్టు స్థానం ఎలా ఉందో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2023, 10:11 AM IST
World Cup Points: పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రన్‌రేట్ కారణంగా రెండవ స్థానంలోనే ఇండియా

World Cup Points: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగుతోంది. ఇవాళ శ్రీలంకతో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకపై గెలిస్తే టీమ్ ఇండియా నేరుగా సెమీస్‌లో అధికారికంగా చేరిపోనుంది. అసలు సెమీస్ అవకాశాలు ఎవరికెక్కువగా ఉన్నాయి, ఎవరికి ఇంకా సజీవంగా ఉన్నాయనేది తెలుసుకుందాం..

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీ ఫైనల్ సమీపిస్తోంది. ఇప్పటికే సెమీస్ బరి నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకోగా, ఇంగ్లండ్ అదే బట పట్టనుంది. ఆ తరువాత శ్రీలంక తప్పుకోవచ్చు. ఇక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లకు ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ విజయంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. కివీస్‌పై విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. టీమ్ ఇండియా కూడా 12 పాయింట్లతో ఉన్నప్పటికీ రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా మెరుగ్గా ఉండటం ఇందుకు కారణం. 

దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌లు గెలిచి ఆరింట విజయంతో 12 పాయింట్లు సాధించింది. రన్‌రేట్ 2.290తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక టీమ్ ఇండియా ఆరు మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఉన్నా రన్‌రేట్ 1.405 కావడంతో రెండవ స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌లలో 4 గెలిచి 8 పాయింట్లు సాధించి 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. న్యూజిలాండ్ 7 మ్యాచ్‌లు ఆడి4 గెలిచి 8 పాయింట్లు సాధించి 0.484 రన్‌రేట్‌తో నాలుగవ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 7 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా, ఆప్ఘనిస్తాన్ 6 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. ఇక శ్రీలంక 6 మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ కూడా ఇదే పరిస్థితి. బంగ్లాదేశ్ 7 మ్యాచ్‌లలో 1 మాత్రమే గెలిచి 2 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ బరి నుంచి అధికారికంగా తప్పుకుంది. ఇక ఇంగ్లండ్ 6 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ బరి నుంచి దాదాపుగా తప్పుకుంది. 

బంగ్లాదేశ్ తరువాత ఇంగ్లండ్, నెదర్లాండ్స్, శ్రీలంక వరుసగా సెమీస్ బరి నుంచి తప్పుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా అధికారికంగా సెమీస్ నుంచి తప్పుకోకపోయినా ఆ అవకాశాలు మాత్రం లేవు. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే అట్టడుగు స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రన్‌రేట్ ఇంగ్లండ్ కంటే కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ దేశం 9వస్థానంలో ఉంది. 

Also read: ICC World Cup 2023: ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ నేడే, గెలిస్తే నేరుగా సెమీస్‌కు టీమ్ ఇండియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News