Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నాదల్.. 13 ఏళ్ల తర్వాత గెలుపు!

Australian Open 2022: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన టెన్నిస్ క్రీడాకారుడిగా స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో మెద్వెదెవ్ ను ఓడించి.. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నాదల్ నిలవడం విశేషం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 09:33 PM IST
    • ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా రఫెల్ నాదల్
    • ఫైనల్ లో మెద్వెదెవ్ పై భారీ విజయం
    • 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన నాదల్
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నాదల్.. 13 ఏళ్ల తర్వాత గెలుపు!

Australian Open 2022: ఆస్ట్రేలియా ఓపెన్ 2022 ఛాంపియన్ గా స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రఫెన్ నాదల్ నిలిచాడు. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్ మ్యాచ్ మెద్వదెవ్ పై విజయం సాధించి.. కెరీర్ లో 21 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నాడు. జకోవిచ్, ఫెదరర్ లను అధిగమించి.. అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ ఫైనల్ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు మెద్వెదెవ్ తో రఫెల్ నాదల్ పోటీపడ్డాడు. ఆటలోని మొదటి రెండు సెట్లలో మెద్వెదెవ్ ఆధిక్యం కనబర్చగా.. ఆ తర్వాత జరిగిన మూడు సెట్లలో నాదల్ పైచేయి సాధించాడు. 

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో నాదల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 2-6, 6-7, 6,4, 6-4, 7-5 తేడాతో నాదల్ గెలుపొందాడు. అయితే 2009 తర్వాత రఫెల్ నాదల్ మళ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుపొందడం విశేషం.  

Also Read: IND vs SA: టీమిండియాను మిడిలార్డర్‌ సమస్య వేధిస్తోంది.. అతడిని జట్టులోకి తీసుకోవాల్సిందే: మంజ్రేకర్‌

Also Read: ICC Test Rankings: టెస్టుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా... మూడో స్థానానికి పడిపోయిన భారత్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News