IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!

India vs Pakistan Asia Cup 2022, Pakistan beat India in Super 4 Clash. ఆసియా కప్‌ 2022 గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ .. కీలకమైన సూపర్‌ 4 దశలో ఓడిపోయింది  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 5, 2022, 06:21 AM IST
  • నిరాశపరిచిన భారత బౌలర్లు
  • ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం
  • భారత్ పోరాటం సరిపోలేదు
IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!

Asia Cup 2022 IND vs PAK, Pakistan defeat India by five wickets: ఆసియా కప్‌ 2022 గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత్ .. కీలకమైన సూపర్‌ 4 దశలో ఓడిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా హోరాహోరీగా జరిగిన పోరులో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఓడింది. భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్‌ రిజ్వాన్‌ (71; 51 బంతుల్లో 6×4, 2×6), మహ్మద్‌ నవాజ్‌ (42; 20 బంతుల్లో 6×4, 2×6) మెరుపులు మెరిపించారు. మహ్మద్‌ నవాజ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (14) మరోసారి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న ఫకార్‌ జమాన్‌ (15; 18 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎక్కువసేపు నిలవలేదు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ మహ్మద్‌ రిజ్వాన్‌ చెలరేగిపోయాడు. మరోవైపు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్‌ నవాజ్‌ భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. నవాజ్‌ ప్రతి బంతికి బౌండరీకి తరలించండంతో పాక్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 

మహ్మద్‌ నవాజ్‌ చెలరేగడంతో 10 ఓవర్లకు 76/2తో ఉన్న పాక్‌.. 15 ఓవర్లకు 135/2తో పటిష్ట స్థితికి చేరుకుంది. చివరి 5 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన సమయంలో నవాజ్‌, రిజ్వాన్‌లు వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. రవి బిష్ణోయ్‌ వేసిన 18వ ఓవర్లో అసిఫ్‌ అలీ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ సింగ్ నేలపాలు చేశాడు. 2 ఓవర్లలో 26 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ ఏకంగా 19 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్‌ పాక్‌ వైపు మొగ్గింది. చివరి ఓవర్లో పాక్ 7 పరుగులే చేయాల్సి రాగా అర్ష్‌దీప్‌ కట్టుదిట్టంగానే బంతులు వేశాడు. రెండో బంతికి అసిఫ్‌ అలీ ఫోర్‌ బాది.. నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఐదో బంతికి ఇఫ్తికార్‌ 2 పరుగులు తీసి పాక్‌ను గెలిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (60; 44 బంతుల్లో 4×4, 1×6 హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (28; 20 బంతుల్లో 1×4, 2×6), రోహిత్‌ శర్మ (28; 16 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించకపోవడంతో భారత్ 200 పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయింది. బౌలర్లు విఫలమవడంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. రేపు సూపర్‌ 4 రెండో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది. ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచులో భారత్‌ గెలవాల్సి ఉంది.  

Also Read: iPhone 14: మూడ్రోజుల్లో ఐఫోన్ 14 లాంచ్, ఐఫోన్ 14 ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

Also Read: Rain Alert: ఉత్తర, దక్షిణ ద్రోణి ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News